Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా భారత క్రికెట్‌లో మరోసారి తీవ్ర దుమారం రేపాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తనను మోసం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశాడు.

2016లో న్యూజిలాండ్‌పై జరిగిన వన్డే సిరీస్‌లో ఏకంగా 15 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అందుకున్న విషయాన్ని మిశ్రా గుర్తుచేశాడు. ఆ తర్వాత గాయం కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమయ్యానని, ఫిట్‌నెస్ నిరూపించుకుంటే తిరిగి జట్టులోకి తీసుకుంటామని కోహ్లీ, కుంబ్లే ఇద్దరూ తనకు స్వయంగా హామీ ఇచ్చారని తెలిపాడు.

ఎన్‌సీఏలో కష్టపడి యో-యో టెస్ట్ పాసై, ఫిట్‌నెస్ సాధించిన తర్వాత వారిద్దరినీ సంప్రదిస్తే కనీసం సరైన సమాధానం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మాట ఇచ్చి తప్పారని, వారు అలా చేయకుండా ఉంటే భారత్ తరఫున తాను ఇంకో రెండేళ్లు ఆడేవాడినని మిశ్రా అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola