All Rounder Axar Patel Injury | 2026 టీ20 ప్రపంచ కప్ నుంచ అక్షర్ అవుట్ ?

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి T20 మ్యాచ్‌లో అల్ రౌండర్ అక్షర్ పటేల్ ( Axar Patel ) గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడు, డారిల్ మిచెల్ ( Daryl Mitchell ) కొట్టిన షాట్‌ను అందుకోవడానికి అక్షర్ ప్రయత్నించగా, బాల్ అతని ఎడమ చేతి చూపుడు వేలికి తగిలింది. బాల్ తగలగానే అక్షర్ వేలి నుంచి రక్తం వచ్చింది. 

ఆ సమయానికి అక్షర్ ఓవర్లో మూడు బంతులు మాత్రమే వేశాడు. అక్షర్ ఎడమ చేతి వాటం బౌలర్ కావడంతో, అతను తన ఓవర్ పూర్తి చేయకుండానే మైదానం నుంచి వెళ్లిపోయాడు. అక్షర్ ఓవర్లోని మిగిలిన మూడు బంతులను అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) వేశాడు. అక్షర్ మైదానం నుంచి విడడంతో ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. 

T20 ప్రపంచ కప్ లో భారత వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ ను నియమించారు. వరల్డ్ కప్ కు మరికొద్ది రోజుల టైం మాత్రమే ఉంది. అక్షర్ గాయంపై BCCI నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ రాలేదు. దాంతో ఫ్యాన్స్ అంతా టెన్షన్ లో పడ్డారు. గాయం తీవ్రత ఆధారంగానే బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola