Akash Choudhary Half Century | 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆకాష్ చౌదరి
మేఘాలయ యంగ్ బ్యాటర్ ఆకాష్ కుమార్ చౌదరి చరిత్ర సృష్టించాడు. రంజీ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కేవలం 11 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన రికార్డును సాధించాడు.
2012లో ఇంగ్లాండ్ ప్లేయర్ వేన్ వైట్ 12 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసాడు. ఇప్పుడు తన రికార్డును కూడా ఆకాష్ చేరిపేసాడు. మేఘాలయ తరఫున ఆకాష్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఆకాష్ వరుసగా 8 సిక్సులు కొట్టాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రవి శాస్త్రి, గ్యారీ సోబర్స్, మైక్ ప్రోక్టర్ మాత్రమే ఆరు సిక్సర్లు వరుసగా బాది రికార్డులు సృష్టించారు. ఆకాష్ కుమార్ చౌదరి సాధించిన ఈ హాఫ్ సెంచరీ కేవలం రంజీ ట్రోఫీ చరిత్రలోనే కాదు, ప్రపంచ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా నిలిచింది. 11 బాల్స్ లో హాఫ్ సెంచరీ, ఎనిమిది వరుస సిక్సర్లు కొట్టడంతో భారత క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు.