Ajaz Patel| ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన భారత సంతతి స్పిన్నర్‌ | ABP Desam

న్యూజిలాండ్‌ క్రికెటర్ అజాజ్‌ పటేల్‌ చరిత్ర సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్‌ జిమ్‌లేకర్‌, భారత స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే గతంలో ఈ ఘనత అందుకున్నాడు. టీమ్ఇండియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజాజ్‌ పటేల్‌ ఏకంగా పది వికెట్లు పడగొట్టాడు. అతడు భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. పైగా ముంబయిలోనే అజాజ్‌ పటేల్‌ జన్మించడం ప్రత్యేకం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola