ఆసియా కప్ నుంచి ఆఫ్ఘన్ ఔట్.. సూపర్-4 లో ఇండియా షెడ్యుల్ ఫైనల్

Continues below advertisement

ఆసియా కప్‌ 2025 నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఔట్ అయిపోయింది. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో పరమ చెత్త బౌలింగ్ తో దారుణంగా ఓడిపోయింది. అయితే శ్రీలంక మాత్రం నువాన్ తుషారా అద్భుతమైన బౌలింగ్, ఆ తర్వాత కుశాల్ మెండిస్ సూపర్ హాఫ్ సెంచరీతో 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్‌ను ఓడించి గర్వంగా సూపర్-4లో అడుగుపెట్టింది. లంక మాత్రమే కాదు.. ఆఫ్ఘనిస్తాన్ ఓటమితో బంగ్లాదేశ్‌ కి సూపర్-4 లైన్ క్లియర్ అయిపోయింది. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే.. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్.. ఓపెనింగ్ నుంచే తడబడింది. 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అయితే రషీద్ ఖాన్ తో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన నబీ.. ఆఖరి ఓవర్లో మహ్మద్ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. ఏకంగా 5 సిక్స్ లు బాది.. 22 బంతుల్లో 60 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. టీంకి 169 పరుగుల ఫైటింగ్ టోటల్ అందించాడు. కానీ ఈ స్కోరును ఆఫ్ఘన్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. చేజింగ్ లో లంక బ్యాటర్ కుశాల్ మెండిస్ 52 బంతుల్లో 10 ఫోర్లతో  74 పరుగులు చేసి టీం గెలుపులో కీ రోల్ పోషించాడు. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ లాంటి World-class spin department ఉన్న ఆఫ్ఘన్ జట్టు.. ఈ do-or-die మ్యాచ్ లో చేతులెత్తేసింది. ముఖ్యంగా రషీద్ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. ఈ ఓటమితో 3 మ్యాచ్ ల్లో ఒక్కటే గెలిచి ఆఫ్ఘన్ టోర్నీ నుంచి బయటికెళ్ళిపోగా.. గ్రూప్B లో3 మ్యాచులు గెలిచిన  శ్రీలంక tabld topper గా. 2 మ్యాచ్ లు గెలిచిన బంగ్లా రెండో place లో సూపర్ 4 కి అర్హత సాధించాయి. దీంతో సూపర్-4 ఫైట్ లో ఆల్రెడీ 21 న పాక్ తో వార్ కి రెడీ అవుతున్న ఇండియా.. 24న బంగ్లాని, 26న శ్రీలంకని ఢీ కొట్టబోతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola