Abhishek Sharma Records Ind vs NZ T20 | అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్

న్యూజిలాండ్ పై టీమ్ ఇండియా యంగ్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) విధ్వంసం సృష్టించాడు. మూడవ టీ20 మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. కేవలం 20 బంతుల్లోనే 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 153 పరుగులు చేసింది. 154 పరులుగా లక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. కానీ తోలి బంతికే సంజు శాంసన్ ( Sanju Samson ) రూపంలో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన అభిషేక్ ఎక్కడా తగ్గకుండా పరుగులు రాబట్టాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దాంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నాడు. 

అభిషేక్ శర్మ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) రికార్డును మాత్రం బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు అభిషేక్ 14 బంతుల్లోనే ఆ ఫీట్ సాధించి హార్దిక్ రికార్డును అధిగమించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ), అభిషేక్ శర్మతో కలిసి న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. అలా భారత్ 10 ఓవెన్లలోనే మ్యాచ్ ను ముగించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola