కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ

Continues below advertisement

ఇండియా, సౌతాఫ్రికా మధ్య నేడు 5వ టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ సాధించిన ఓ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రెడీ అవుతున్నాడు. టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి అభిషేక్ జస్ట్ 47 రన్స్ దూరంలో ఉన్నాడు. 2016లో విరాట్ కోహ్లీ టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 1614 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది అభిషేక్ 39 టీ20 మ్యాచ్‌ల్లో 1568 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇప్పుడు ఆ రికార్డ్‌కు అభిషేక్ శర్మ జస్ట్ సరిగ్గా 46 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి అభిషేక్‌కి సౌతాఫ్రికాతో జరిగే 5వ టీ20నే ఆఖరి ఛాన్స్‌లా కనిపిస్తోంది. అయితే దూకుడుగా ఆడటంతో భారీ స్కోర్లు చేయలేకపోతున్న అభిషేక్.. సఫారీలతో 5 టీ20ల సిరీస్‌లో మొదటి 2 టీ20ల్లో 34 రన్స్ మాత్రమే చేశాడు. ఇక మూడో మ్యాచ్‌లో 35 రన్స్ చేశాడు. నాలుగో మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దవడంతో ఇక ఇప్పుడు మిగిలిన 5వ మ్యాచ్ మాత్రమే అభిషేక్‌కి మిగిలింది. మరి ఈ మ్యాచ్‌లో అయినా హాఫ్ సెంచరీ మార్క్ దాటి.. కోహ్లీ రికార్డ్‌ను అభిషేక్ బద్దలు కొడతాడో లేదో చూదాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola