AB De Villiers As RCB Head Coach | RCB హెడ్ కోచ్ గా డివిల్లియర్స్
సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కు ఇండియాలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ లో తన గేమ్ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడంలో డివిలియర్స్ ఎప్పుడు ఫెయిల్ అవలేదు. అయితే డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియా ఫ్యాన్స్ కూడా బాగా డిస్సపాయింట్ అయ్యారు. డివిలియర్స్ మళ్ళి ఐపీఎల్ లో ఆడాలని చాలామంది కోరుకున్నారు. ఇప్పుడు వాళ్లు అనుకున్నట్టుగానే జరగబోతుంది. ఏబీ డివిలియర్స్ కోచ్‌గా తన కెరీర్ ను మళ్ళి మొదలు పెట్టబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఫ్యూచర్‌లో నేను మళ్లీ ఐపీఎల్‌లో భాగమయ్యే అవకాశం ఉంది. ప్రొఫెషనల్‌గా ఆడలేను. ఆ రోజులు అయిపోయాయి. ఒకవేళ RCB నాకు కోచ్ లేదా మెంటార్‌గా బాధ్యతలు ఇస్తే మాత్రం నేను రెడీగా ఉన్నానని అన్నాడు డివిలియర్స్. ఈ ఒక మాటతో ఫ్యాన్స్ అంతా సంతోషంలో మునిగిపోయారు. ఎలాగైనా 2026 ఐపీఎల్ లో డివిలియర్స్ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.