ముంబై ఇండియన్స్ లోకి ధోనీ? CSK ఫ్యాన్స్ కి హార్ట్ బ్రేక్!

Continues below advertisement

MS Dhoni  ఏకంగా ముంబై ఇండియన్స్ (MI) జెర్సీలో కనిపించి ఫ్యాన్స్ కి భారీ షాకిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన తర్వాత, ధోనీ లైఫ్ అంటే... IPLలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కోసం ఆడటం, IPL అయిపోగానే మోకాలి గాయం నుండి కోలుకోవడం. ఇదే తలా రొటీన్. కానీ రీసెంట్ గా MI teamతో ఒక క్యాజువల్ ఫుట్‌బాల్ గేమ్ తర్వాత ప్లేయర్స్ తో ఫోటో కోసం ధోని.. MI  టీం స్లీవ్‌లెస్ జెర్సీ వేసుకుని.. పోజిచ్చాడు. ఆ ఫోటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ధోని CSKని వదిలి ముంబైలోని వెళ్ళిపోతున్నాడెమో అని ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.

‘తల ధోని CSKతో తన 18 ఏళ్ల బంధానికి ఎండ్ కార్డ్ వేయబోతున్నాడా? అందుకు ఈ ఫోటో హింటా? లేదంటే CSK నుంచి రిటైర్ అయి MI team coach గా లేదా mentor గా చేరబోతున్నాడా? సైలెంట్ గా అయితే ఏదో జరుగుతున్నట్లే ఉంది‘ అంటూ కొందరు CSK ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్ట్ లు పెడుతున్నారు. ఇంకొంతమందైతే ‘ ధోని ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడు కాబట్టి.. రిటర్న్‌గా రోహిత్ శర్మని CSKలోకి తీసుకురావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు

దీనికి తోడు ధోనీ కూడా ఈ మధ్యనే IPL 2026 గురించి మాట్లాడుతూ, ‘ఇంకా 4-5 నెలల టైమ్ ఉంది, డిసైడ్ అవ్వడానికి తొందరేం లేదు. ఆలోచించి డిసైడ్ అవుతాను’ అన్నాడు. అంటే ఫ్యాన్స్ ను ధోనీ ఇంకా  డైలెమ్మా లో పడేసాదన్నమాట. మరి ఈ షాకింగ్ MI జెర్సీ ఫోటో వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో..2026 IPL లో ధోని CSK లోనే ఉంటాడా, లేదంటే నిజంగానే ముంబై ఇండియన్స్ కి  షిఫ్ట్ అవుతాడా? అనే question కి ఆన్సర్ కావాలంటే మాత్రం ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola