3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction |

ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ జట్టుకు 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ... దిల్లీ క్యాపిటల్స్ కు ట్రోఫీ అందిస్తే ఎలా ఉంటుంది..?లక్నో సేనాధిపతిగా మారితే ఎలా ఉంటుంది..?పంజాబ్ కింగ్ గా గ్రౌండ్ లో అడుగుపెడితే బాగుంటుందా..? మెగా వేలం ముందర ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ చర్చలు జరుగుతున్నాయి. లాస్ట్ సీజన్ లో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా చేసింది ముంబయి ఇండియన్స్. ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న రోహిత్.. ఈ మెగా వేలంలో ముంబయిని వీడటం దాదాపుగా ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ అండ్ 6వేల పరుగుల మైల్ స్టోన్ అందుకున్న ఈ ఆటగాడిని ఇప్పడు తమ టీమ్ లో వేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా.. సరైన కెప్టెన్ లేక సతమతమవుతున్న దిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ రోహిత్ శర్మను వేలంలో కొనుక్కునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola