సాక్షాత్తూ నారాయణి స్వయంభూగా వెలసింది ఈ క్షేత్రం
వేల సంవత్సరాల కిందట ఈ ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది. ఈ అడవికి ఆనుకుని రెండంటే రెండే వీధులతో పదుల సంఖ్యలో ఇళ్లు ఉన్న చిన్న ఊరు కావడంతో దీనికి పేరు కూడా లేదు. ఒక సారి ఊళ్లో మశూచి వ్యాధి ప్రబలింది. దీంతో చాలా మంది మృత్యువాత పడ్డారు. ఆ పరిస్థితిలో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో జీవించే రైతు దేవుడి మీద భారం వేసి, పొలం సాగుచేసుకునేవాడు. ఒకరోజు పొలం దున్నుతుండగా, నాగలి భూమిలో ఇరుక్కుపోయింది. ఎడ్లు ఎంత లాగినా నాగలి బయటకు రాలేదు. అతను చుట్టుపక్కల వారిని పిలిచి, వారి సహాయంతో బయటకు తీసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో నాగలిని అలానే వదిలి, ఎడ్లను ఇంటికి తోలుకుపోయాడు. ఆ రాత్రి గ్రామపెద్ద కలలో అమ్మవారు కనిపించి, నాగలి ఆగిన చోట తాను ఉన్నాననీ, తన పేరు స్వేచ్ఛావతి అనీ చెప్పి అంతర్థానమైంది.