Ganesh Immersion 2021: వినాయక పూజ, నిమజ్జనంతో కలిగే ప్రయోజనాలు తెలుసా!
నవరాత్రులు పూజలందించిన తర్వాత మేళతాళాలతో గంగమ్మ ఒడికి గణేషుడిని చేరుస్తారు. దీని వెనక ఎంత వేదాంత రహస్యం ఉందో తెలుసా… వినాయకుడిని 21 పత్రితో పూజిస్తారు. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. వాటి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు లాంటిదన్నమాట. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలవడంతో వాటిలో ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించడమే కాదు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.