ys sharmila:ఎలా ఉన్నావమ్మా అంటూ షర్మిళను పలుకరించిన వైవీ సుబ్బారెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజాప్రస్థాన పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ షర్మిళను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఇప్పుడీ విషయం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కుటుంబసభ్యునిగా కలిశారా లేక వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో కలసి సంఘీభావం తెలిపి ఉంటారా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజాసమస్యలపై పోరాడుతానంటూ షర్మిళ నిర్వహిస్తున్న పాదయాత్రలో వైఎస్సార్ అభిమానులు, నేతలు పాల్గొంటున్నారు.