YS Jagan meets PM Modi| ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్...!|

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో మోదీని కలిసిన జగన్...గంట పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈమేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించిన ముఖ్యమంత్రి ప్రత్యేక తరగతి హోదా, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం. రెవిన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని ముందు ఉంచారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించిన సీఎం...రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేలా సహకరించాలని కోరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola