Zohran Mamdani won Newyork Mayor Election | న్యూయార్క్ మేయర్ గా గెలిచిన జోహ్రాన్ మమ్ దానీ | ABP Desam

Continues below advertisement

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి భారతీయ అమెరికన్ ల సెగ తప్పేలా లేదు. న్యూయార్క్ మేయర్ గా జోహ్రాన్ మమ్ దానీ విజయం సాధించాడు. ఇది నిజంగా ట్రంప్ కి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ కోసం ట్రంప్ మమ్ దానీ పై డైరెక్ట్ గా వెర్బల్ ఎటాక్ చేశారు. అయినా వాటన్నింటినీ తట్టుకున్న మమ్ దానీ మేయర్ ఎలక్షన్స్ లో సంచలన విజయం సాధించి 49.2 శాతం ఓట్లతో 34ఏళ్ల వయస్సుకే న్యూయార్క్ మేయర్ గా గెలిచిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. గెలిచిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ పేరును నేరుగా ప్రస్తావిస్తూ ఆయన ఫేమస్ కామెంట్స్ ని కోట్ చేస్తూ తనో సోషలిస్ట్ అని మరోసారి ట్రంప్ కి వినపడేలా ఫస్ట్ స్పీచ్ ఇచ్చారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్ దానీ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి. తండ్రి మహ్మూద్ మమ్దానీ ఉగాండాలో జన్మించిన భారతీయ వంశస్తుడు. ఆయన ఆఫ్రికాలో ప్రముఖ రాజకీయ తత్వవేత్త. ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌. ఇక మమ్ దాని తల్లి మీరా నాయర్. భారతీయ మూలాలున్న ప్రపంచ ప్రఖ్యాత సినీ దర్శకురాలు ఆమె. 1957లో ఒడిశా రాష్ట్రం రూర్కెలాలో జన్మించిన మీరా నాయర్, Salaam Bombay, Monsoon Wedding, The Namesake వంటి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola