Xi Jin Ping on Ukraine | US-China Relations | Joe Biden తో Video Call లో కీలక వ్యాఖ్యలు
Ukraine పై Russia Invasion కి సంబంధించి America President Joe Biden, China President Xi JinPing మధ్య సుమారు గంటా 50 నిమిషాల పాటు వీడియో కాల్ నడిచింది. ఈ వీడియో కాల్ లో జిన్ పింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా కేవలం Bilateral Relations మెరుగుపర్చుకోవడమే కాక అంతర్జాతీయ బాధ్యతలు తీసుకోవాలని జిన్ పింగ్ ఈ వీడియో కాల్ లో అన్నారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం మేం చూడాలని అనుకున్నది కాదని జిన్ పింగ్ అన్నారు. రెండు దేశాల మధ్య పరిస్థితులు యుద్ధాల వరకు దారి తీసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.