Why South Africa Bow down to PM Modi | వైరల్ గా మారిన ప్రధాని మోదీ ఆహ్వాన వేడుక | ABP Desam
సౌతాఫ్రికాలో జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ సౌతాఫ్రికా వెళ్లారు. అక్కడ రెండు రోజులుగా మోదీ పర్యటిస్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం మోదీ జోహన్నసెబర్గ్ కి చేరుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. మిలటరీ స్వాగతం తర్వాత సౌతాఫ్రికా సంప్రదాయాలను అనుసరించి మోదీకి స్వాగతం పలికారు. అయితే ఇదే టైమ్ లో వాళ్లంతా కింద నేల మీద పడి మోదీకి నమస్కరించటం ఇంటర్నేషనల్ మీడియాలో చర్చగా మారింది. ప్రధాని మోదీ స్థాయికి సౌతాఫ్రికా ఇచ్చిన అత్యున్నత గౌరవం ఇదంటూ ఇంటర్నేషనల్ మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. అయితే ఇది సౌతాఫ్రికా కల్చర్ లో ఓ భాగం అని మరికొంత మంది చెబుతున్నారు. ప్రత్యేకించి మోదీ ముందు శుక్రవారం నృత్య ప్రదర్శన చేసిన వాళ్లు వెండా కల్చర్ కి చెందిన వాళ్లు. మధ్య ఆఫ్రికాలో గ్రేట్ లేక్స్ కి చెందిన వాళ్లంతా కొన్ని వందల ఏళ్లుగా తమ సంస్కృతి సంప్రదాయాలను ఆటవిక ఆచారాలను కొనసాగిస్తూ నేటికి జీవిస్తున్నారు. అందుకే భాగమే ఈ బో డౌన్. ఎవరైనా తమ ప్రాంతానికి కొత్త వారు అందునా వారు వేరే ప్రాంతాలకు చెందిన అత్యంత శక్తి సంపన్నులైతే తప్ప ఇలా తలొంచి నేలకు శరీరాన్ని తాకిస్తూ వారు నమస్కారం చేయరట. స్వతాహాగా శౌర్యులైన ఈ ఆటవిక జాతి.. భారత్ కు నాయకత్వం వహిస్తున్న మోదీకి, సౌతాఫ్రికా, ఇండియా మధ్య ఉన్న అనుబంధానికి గుర్తుగానే ఇలా బో డౌన్ అయ్యారు తప్ప ఇందులో మరే ప్రత్యేకత లేదని ఇదేమీ బానిసత్వపు గుర్తుగా పరిగణించాల్సిన అవసరం లేదని మరికొంత మంది చెబుతున్నారు. వారి ఆహ్వానానికి గౌరవం ఇచ్చినందునే ప్రధాని మోదీ కూడా వినమ్రంగా మోకాళ్ల వరకూ వంగి వారికి ప్రతి నమస్కారం చేశారు.