Vivek Ramaswamy Quits: ఒక్కసారిగా రేసు నుంచి వివేక్ ఎందుకు తప్పుకున్నారు..?
Continues below advertisement
భారతీయ- అమెరికన్, ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయోవా ప్రైమరీ పోరులో ఏ మాత్రం ప్రభావం చూపించని తరుణంలో వివేక్ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అలాగే మాజీ అధ్యక్షుడు ట్రంప్(Trump)నకు మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం రాసుకొచ్చింది.
Continues below advertisement