Trump vs Zelensky | రష్యాను రెచ్చగొట్టారు..ఉక్రెయిన్ చేయి వదిలేశారు..పాపంరా రేయ్ | ABP Desam
ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి లాంటి సిచ్యుయేషన్ వచ్చింది ఉక్రెయిన్ కి ఇప్పుడు. దేశం మీద పడి దాడి చేస్తున్న రష్యాతో శాంతి కోసం సంధి చేసుకుందాం అనలేదు. ఇన్నాళ్లు వెనుక ఉండి ఉసిగొల్పిన అమెరికాను ఇకపై సాయమూ అడగలేదు. అడకత్తెర పోక చెక్క అంటారు కదా అలాంటి పొజిషన్ లో ఉంది ఉక్రెయిన్. ఇక వైట్ హౌస్ లో ట్రంప్ ఎడా పెడా అరిచేయటంతో చిన్న బుచ్చుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇప్పుడు ఏం చేయనున్నారనే చర్చ అన్ని ప్రశ్నే అన్ని చోట్ల నుంచి వినిపిస్తోంది.
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూద్దాం. 2022 ఫిబ్రవరి 24. ఆరోజు ఓ వార్తను ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. యుక్రెయిన్ కి పూర్తిగా ఆక్రమించుకుంటామంటూ రష్యా చేసిన ప్రకటన అది. ఇప్పుడున్న ప్రపంచంలో అసలు బుర్రోడున్న ఎవ్వడూ యుద్ధానికి దిగడు. ఎవడికీ అంత ఓపిక లేదు అని విశ్లేషకులు మెటికలు విరుచుకుంటూ చెప్తున్న టైమ్ లో తన రూటే సపరేటంటూ యుద్ధ భేరీ మోగించాడు పుతిన్.
ఇకంతే నాటో దేశాలన్నీ అప్రమత్తమైపోయాయి. ఉక్రెయిన్ ను ఆక్రమించుకుంటుంటే మనం సైలెంట్ గా ఉంటే రేపు ఐరోపా మొత్తం నాదే అంటాడు పుతిన్ అంటూ నాటోలో ఉన్న యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఉక్రెయిన్ కి సపోర్ట్ వచ్చాయి. సందట్లో సండేమియాలా అప్పుడొచ్చింది మెల్లగా అమెరికా. ఉక్రెయినూ ఉక్రెయినూ ఆ రష్యా మాకు శత్రుదేశం కాబట్టి..మీకు మేం అండగా ఉంటాం...కావాల్సినన్ని ఆయుధాలు ఇస్తాం. యుద్ధం మొదలుపెట్టండి కదనరంగంలోకి దూకించాడు. ఇవన్నీ నమ్మి అమాయకుడిలా బలైపోయింది ఎవరంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. అప్పటికే క్రిమియాను రష్యాకు కోల్పోయిన కోపంలో ఉన్న ఉక్రెయిన్ కు జెలెన్ స్కీ నిర్ణయం తప్పు అనిపించలేదు. భీకరంగా సాగిన యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈలోగా యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు మేం ఇస్తామన్న అమెరికా కాస్త దాన్ని మాంచి వ్యాపార అవకాశంగా మార్చుకుంది. ఎంతైనా పెట్టుబడిదారి దేశంకదా ..యుద్ధం అయిపోయాక అప్పు తీర్చేద్దాం లే అనుకుని అప్పటి అధ్యక్షుడు బైడెన్ చెప్పిన ప్రతీదీ నమ్మేశాడు జెలెన్ స్కీ. ఎందుకో ఏ మూల బైడెన్ ఉండేది కొన్నేళ్లే కదా తర్వాత రిపబ్లికన్స్ వస్తే తమకు సపోర్ట్ చేస్తారా అని కూడా ఆలోచించి ఉండండు. రీజన్స్ 2. అప్పటికే పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయిన ట్రంప్ అధికారంలోకి మళ్లీ రావటం సాధ్యపడని పని అనుకుని ఉండొచ్చు. రెండోది ట్రంప్ వచ్చినా కూడా రష్యాను మిత్ర దేశంగా భావించలేరు కాబట్టి చచ్చినట్లు తమకు సపోర్ట్ చేస్తారు అనుకుని ఉండొచ్చు.