USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
అమెరికా చరిత్రలో మేబీ ట్రంప్ రేంజ్‌లో పాకిస్తాన్ మీద ప్రేమ ఒలకబోసిన ప్రెసిడెంట్ ఇంకెవ్వరూ ఉండరేమో. షెహబాజ్ షరీఫ్‌లో తన తప్పిపోయిన తమ్ముడు కనిపిస్తున్నాడో.. అసిమ్ మూనీర్‌లో పూర్వజన్మ లవర్ కనిపిస్తుందో తెలీదు కానీ.. పాకిస్తాన్‌కి మాత్రం అమెరికా మొత్తాన్ని దోచి పెట్టడానికి కూడా రెడీ అయిపోయేలా ఉన్నాడు ట్రంప్ బాబాయ్. సడెన్‌గా ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే.. రీసెంట్‌గా అమెరికా.. పాకిస్తాన్‌లో ఏకంగా 3.2 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ అయింది. అందులో 1.2 బిలియన్ డాలర్స్ కరెన్సీ రూపంలో ఇస్తే.. 2 బిలియన్ డాలర్స్ విలువైన మైనింగ్ మెషినరీని పాక్‌లో డెప్లాయ్ చేయబోతోంది యూఎస్. అయితే ఒకపక్క యూఎస్‌లోని పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంటే.. ట్రంప్ మాత్రం ఎందుకిలా పాకిస్తాన్‌ని చంకకెత్తుకుని గోరుముద్దలు తినిపిస్తున్నాడు? దీని వెనకున్న అసలు రీజన్ ఏంటి?
2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్లు.. అంటే 2.9 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది అమెజాన్. వచ్చే నాలుగేళ్లలో 17.5 బిలియన్ డాలర్లు అంటే 1.45 లక్షల కోట్లు పెట్టుబడులు భారత్‌లో పెట్టబోతోంది మైక్రోసాఫ్ట్. రాబోయే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు అంటే కోటి 1.25 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పందం చేసుకుంది గూగుల్. ఇక యాపిల్ ఇప్పటికే చైనా నుంచి మాన్యుఫాక్చరింగ్ యూనిట్స్‌ని ఇండియాకి మారుస్తూ 1.5 బిలియన్ డాలర్లు అంటే 12 వేల 500 కోట్లు ఆల్రెడీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. రాబోయే ఐదేళ్లలో ఇది డబుల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టిమ్ కుక్ స్వయంగా ప్రకటించినట్లు వార్తలున్నాయి. అంటే యూఎస్‌కి చెందిన ఈ టెక్ జెయింట్ కంపెనీలన్నీ రాబోయే ఐదేళ్లలో అటు ఇటుగా 6.32 లక్షల కోట్ల పెట్టుబడుల్ని భారత్‌లో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. కానీ.. యూఎస్ ప్రైవేట్ కంపెనీలన్నీ ఇండియావైపు చూస్తుంటే.. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మనసులో మాత్రం పాకిస్తాన్‌పై ప్రేమ పొంగుకొస్తోంది. ఆ ప్రేమలోనే రీసెంట్‌గా పాకిస్తాన్‌కి 1.2 బిలియన్ డాలర్లు అంటే 10 వేల కోట్ల రూపాయలకు పైగా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని యూఎస్ వైట్‌హౌస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.