Trump on Greenland | గ్రీన్‌ లాండ్ కోసం ట్రంప్ ఎందుకు పట్టుబుతున్నాడు | ABP Desam

Continues below advertisement

డోనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ కావాలని పట్టబట్టడం కేవలం పొలిటికల్ హెడ్‌లైన్ గేమ్ కాదు. పైకి రియల్‌ ఎస్టేట్‌ డీల్‌లా కనిపిస్తోంది కానీ ఆ మంచుగడ్డ కింద మహా రహస్యమే దాగుంది.


ప్రపంచ పటంలో గ్రీన్‌లాండ్ చూస్తే. అది మంచుతో నిండిన ఒక పెద్ద దీవిలా అనిపిస్తుంది. జనాభా తక్కువ, ఆర్థిక కార్యకలాపాలు అంతగా లేవు. రాజకీయంగానూ ఎవరిలో ఇబ్బంది పట్టే పరిస్థితులు అక్కడ లేవు. వాస్తవానికి అంత చిన్న దీవిని ఎవరూ అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ మంచు కింద దాగిన దాని విలువను గ్లోబల్ శక్తులు చాలా స్పష్టంగా గుర్తించాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్..! అసలు ఒక మంచు దీవి కోసం ఇంత పట్టుదల ఎందుకు అనిపిస్తుంది కానీ దాని స్ట్రాటజిక్‌గా దాని విలువను చూస్తే దిమ్మతిరుగుతుంది.

గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన ట్రంప్..

డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కావాలని మళ్లీ గట్టిగా ప్రయత్నించడం కేవలం రాజకీయ హెడ్లైన్ గేమ్ కాదు. హై సెక్యూరిటీ, ఎకనామిక్ గ్రోత్, భవిష్యత్ విజన్,  తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనే తపన ఇలా చాలా అంశాలు ఆయన అజెండాను నడిపిస్తున్నాయి. బయటకు చూస్తే ఇది ఒక “రియల్ ఎస్టేట్ డీల్”లా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం మిలిటరీ రీచ్, రేర్ ఎర్త్ ఖనిజాలు, కొత్త షిప్పింగ్ రూట్లు, చైనా – రష్యాలతో పోటీ వంటి సీరియస్ వ్యూహాత్మక లెక్కలే పనిచేస్తున్నాయి. అందుకే మొదట్లో "గ్రీన్‌లాండ్ కొంటాం" అని చెప్పిన ట్రంప్..ఇప్పుడు "తీసేసుకుంటాం" అని పబ్లిక్‌గానే చెబుతున్నాడు. అంతే కాదు నిన్న ఓ అడుగు ముందుకేసి గ్రీన్‌లాండ్‌ను అమెరికా మ్యాప్‌లో చూపించేశాడు కూడా..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola