Trump Guantanamo US Prison for Migrants | అక్రమవలసదారులు ఉగ్రవాదులు ఒకటేనా | ABP Desam
అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ అడ్మిస్ట్రేషన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన పెట్టుకున్న మొదటి టార్గెట్ అక్రమ మార్గాల్లో అమెరికా కు వచ్చి ఉంటున్న వారిని తరిమేయటం. ఇక్కడ తరిమేయటం అని ఎందుకు అన్నానంటే మొదట ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను వెనక్కి వెళ్లిపోవాలని ఫ్లైట్స్ పెట్టి మరీ పంపించారు. చాలా మందిని డీటైన్ చేసిన వాళ్లను కూడా వదిలిపెట్టారు. కానీ అక్రమ వలసదారులుగా దేశంలోనికి నేరాల్లో పాల్గొన్నవాళ్లను మాత్రం వదిలే పెట్టే ప్రస్తక్తే లేదంటున్నారు ట్రంప్. యూఎస్ మెక్సికో సరిహద్దుల్లోకి సైనికులను భారీగా పంపిస్తూ సరిహద్దులను బలోపేతం చేయటం ఓ ప్లాన్ అయితే...అక్రమ వలసదారులుగా దేశంలోని క్రైమ్స్ లో పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించాలి అనుకోవటం రెండో ప్లాన్. ఇందుకోసం గౌటుమాల సిటీలోని యూఎస్ నేవీ బేస్ లో ఉన్న ఉగ్రవాదుల జైలును ట్రంప్ ఎంచుకున్నారు. పరమ కిరాతకులు ఉండే ఆ జైలులో ఈ అక్రమ వలసదారులు ఉండేలా ఓ మైగ్రేషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయించారు ట్రంప్. మొత్తం 30వేల మందిని అక్కడకు తరలించారని ప్లాన్ చేశారంట. ప్రత్యేక విమానాలను పెట్టి అక్కడికి నేరస్థులను అందరినీ తరలిస్తున్నారు. మరి అక్కడ ఉంచిన వాళ్లనో శిక్ష పూర్తవగానే తిరిగి వాళ్ల వాళ్ల దేశాలకు పంపుతారా లేదా ఆ ఉగ్రవాదుల ల్లానే వీళ్లకూ శాశ్వత నరకాన్ని శిక్షగా విధిస్తారా చూడాలి.