
Trump Beast in Daytona500 Racing | గెస్ట్ గా రమ్మంటే తన కార్, ఫ్లైట్ తో ట్రంప్ రచ్చ | ABP Desam
మీకు బీస్ట్ తెలుసు కదా. అమెరికా అధ్యక్ష వాహనం. ప్రపంచంలో సూపర్ సెక్యూరిటీ, సూపర్ పవర్స్ కలిగిన ఏకైక వాహనం. సెక్యూరిటీ పరంగా దీన్ని కొట్టే కారు ప్రపంచంలోనే లేదంటారు. అలాంటి బీస్ట్ ను ఓ కార్ రేసింగ్ లో దింపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్లోరిడాలో జరిగిన ప్రతిష్ఠాత్మక ది డెటోనా 500 కార్ రేస్ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్. అయితే అమెరికన్స్ ను ఉత్సాహపరచటంలో ముందుండే ఆయన రేసింగ్ ప్రారంభానికి ముందు తన బీస్ట్ ను కూడా ల్యాప్స్ లో పాల్గొనమని అధికారులకు చెప్పాడు. పైగా అందులో తన మనవరాలు కరోలినాతో కలిసి ట్రంప్ కూడా ట్రావెల్ చేశారు. మిగిలిన రేస్ కార్లతో రెండు రౌండ్లు కొట్టింది బీస్ట్. గ్రేట్ అమెరికన్స్ అంటే తనెంతో అభిమానిస్తానన్న ట్రంప్….అమెరికా గ్రేట్ అగైన్ చేయటానికి తోడ్పడే ఇలాంటి రేసులను తను గౌరవిస్తానని అందుకే ఇలా బీస్ట్ ను రేసింగ్ లోకి దింపానని చెప్పారు. అంతే కాదు ఆయన తిరిగి వెళ్తూ అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని కూడా రేసింగ్ ట్రాక్ చుట్టూ ఒక రౌండ్ వేయించి రేసర్లపై తన గౌరవాన్ని చాటుకున్నారు ట్రంప్.