Swat River Tragedy Pakistan Flash Floods | పాకిస్తాన్ ప్రభుత్వ చేతకానితనానికి 15మంది బలి | ABP Desam

 సిగ్గుండాలి పాకిస్తాన్..నిజంగా సిగ్గుపడండి. అక్కడి ప్రభుత్వం, ఆర్మీ చేతకాని తనానికి ఇది నిదర్శనం.  పాకిస్తాన్ లో ప్రవహించే స్వాత్ నదికి ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ఇది ఎవ్వరూ ఊహించనిది. సియాల్ కోట్ కు చెందిన 15మంది సభ్యుల కుటుంబం మింగోరా వద్ద విహారయాత్ర కోసం వెళ్లాయి. అప్పటి వరకూ రాళ్లు రప్పల్లా ఉన్నచోట కుటుంబం అంతా సరదాగా గడుపుతోంది. ఉన్నపళంగా కొన్ని నిమిషాల వ్యవధిలో భారీ వరద ప్రవాహం వారిని ముంచెత్తింది. అక్కడే ఉన్న చిన్న మట్టి దిబ్బ పై ఆ కుటుంబంలో 15మంది నిలబడి సహాయం కోసం అర్థించారు. వంద మీటర్ల దూరంలో మనుషులు వాళ్లను గమనించారు. అధికారులకు చెప్పారు. హెలికాఫ్టర్ ను కానీ విపత్తు దళాలను కానీ పంపాలని అడిగారు. కానీ ఒక్కరూ కూడా లేదు. వాళ్ల పరిస్థితి ఎంత దయనీయమో ఊహించుకోండి. చేతిలో నెలల బిడ్డలు ఉన్నారు. చేతులు పట్టుకుని నిలబడే వయస్సు చంటిపిల్లలు ఉన్నారు. వృద్ధులు ఉన్నారు. ఆ కుటుంబం అంతా హాహాకారాలు పెట్టింది. గంట గంటన్నర సమయం గడిచినా ఎవ్వరూ రాలేదు. చేతిలో ఒక్కకొక్కరు చేతులు జారిపోయి వరదలో కొట్టుకుపోయారు. కావాల్సిన వాళ్లంతా కళ్ల ముందే కొట్టుకుపోతుంటే నరకయాతన అనుభవించారు. చివరకు అక్కడ నిలబడిన 15మంది కొట్టుకుపోయినా చేతకాని పాకిస్తాన్ దదమ్మ ప్రభుత్వం తీరు, అక్కడి అధికారుల నిర్లక్ష్యం ఆ 15మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణమైన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో చేతులు దులుపుకోవటానికి స్థానిక అధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది పాకిస్తాన్ ప్రభుత్వం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola