
Sunita Williams Return to Earth Un Docking Success | స్పేస్ స్టేషన్ నుంచి బయల్దేరిన సునీత | ABP Desam
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. నాసా అస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ తో కలిసి భూమి మీదకు ప్రయాణం ప్రారంభిచారు. క్రూ9 అని పిలుచుకునే నలుగురు ఆస్ట్రోనాట్లున్న స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సక్సెస్ ఫుల్ గా అన్ డాక్ అవటంతో రిటర్న్ జర్నీలో రెండో దశ సక్సెస్ ఫుల్ గా పూర్తైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయిన ఈ డ్రాగన్ క్యాప్సూల్ దాదాపుగా 15 గంటల పాటు భూమి చుట్టూ తిరిగి... భూమి కక్ష్యలోకి ప్రవేశించి రేపు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఫ్లోరిడా సముద్రం తీరంలో క్యాప్సూల్ స్ప్లాష్ డౌన్ కానుంది. ఫలితంగా తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత సునీతా విలియమ్స్ భూమి మీదకు తిరిగి రానున్నారు. ఇందుకోసం నాసా శాస్త్రవేత్తలు సర్వం సన్నద్ధం చేశారు. నానా సైంటిస్టుల బృందాలను అనుక్షణం సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చే క్షణాల కోసం నిర్విరామంగా కృషి చేస్తోంది.