
Sunita Williams Return to Earth | నాసాకు కూడా అంతు చిక్కని Communication Blackout | ABP Desam
హలో ఫ్రెండ్స్... ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ లో సునీతా విలియమ్స్ సహా మరో ముగ్గురు ఆస్ట్రానాట్స్ మొన్న భూమి మీద సేఫ్ గా ల్యాండ్ అయ్యారు కదా. ప్రపంచమంతా వాళ్ల ల్యాండింగ్ ను సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ అప్పుడు మీరు నాసా వాళ్లు చూపించిన లైవ్ చూసి ఉంటే ఈ పదం గమనించి ఉంటారు. హా ఈ పదమే. కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్. ఈవిడ ఏం చెప్తున్నారో ఓసారి వినండి...Byte
భూమి మీదకు గంటకు పాతికవేల కిలోమీటర్ల స్పీడ్ తో దిగుతున్న డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ తో నాసాకు 6 నిమిషాలు సంబంధాలు తెగిపోయాయి. టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నా..నాసా దగ్గర ఎక్కడో స్పేస్ లో జరుగుతున్న విషయాలను లైవ్ ఇవ్వగలుగుతున్నా భూమి మీద దిగే ఆ కొద్ది క్షణాలను మాత్రం తన ఆధీనంలోకి తీసుకోలేకపోతోంది. అసలేంటీ కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్. ఆ ఆరు నిమిషాలు శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రీతిలో ఏం జరుగుతుంటుంది..ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం.
ఫ్లోరిడాలోని నాసా కమాండ్ కంట్రోల్ సెంటర్. మరికొద్ది డ్రాగన్ క్యాపూల్స్ కిందకు దిగనుంది. అందులో నలుగురు ఆస్ట్రోనాట్లు ఉన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్, ఇంకా రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్. ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్ డాక్ అయిన డ్రాగన్ క్యాప్ల్యూల్ భూమి కక్ష్యలోకి ప్రవేశించే ముందు 15 గంటల పాటు ఒంటరిగా ప్రయాణాన్ని సాగించింది. ఆ తర్వాత ఆర్బిట్ డీ బర్న్ ప్రక్రియ ద్వారా భూమి కక్ష్యలోకి చేరుకుని ముందే ఫిక్స్ చేసుకున్నట్లుగా ఫ్లోరిడా సముద్రతీరంలో స్ప్లాష్ డౌన్ కావాల్సి ఉంది. అయితే భూమి కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ నుంచి ఆరు నిమిషాల పాటు నాసా కమాండ్ కంట్రోల్ కు సిగ్నల్స్ అందలేదు. దీన్ని కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ అంటారు.
ఇలా ఉన్నపళంగా సంబంధాలు తెగిపోవటానికి కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ అని సైంటిస్టులు పేరు పెట్టుకున్నా దానికి రీజన్ మాత్రం ప్లాస్మా షీత్. మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా పదార్థం ఏదైనా అది మూడు స్థితుల్లో ఉంటుంది. ఒకటి సాలిడ్ స్టేట్, రెండు లిక్విడ్ స్టేట్, మూడు గ్యాసియెస్ స్టేట్. ఘన, ద్రవ, వాయురూపాల్లో ఉంటుంది కదా. ఈ మూడు కాకుండా ఉండో మరో స్టేట్ నే ప్లాస్మా అంటారు. భూమి కక్ష్యలోకి ప్రవేశిస్తున్నప్పుడు డ్రాగన్ క్యాప్యూల్స్ విపరీతమైన ఉష్ణ్రోగ్రతకు గురవుతుంది. పాతికవేల కిలోమీటర్ల స్పీడ్ తో దిగుతున్న క్యాప్యూల్ చుట్టూ ఉన్న గాలి కొన్ని వేల డిగ్రీల ఉష్ణోగ్రతకు లోనై ఉన్నపళంగా మండి క్యాప్యూల్ ముందు భాగాన్ని మండిస్తుంది. భూమి మీదకు రీ ఎంట్రీ అయ్యే ఏ స్పేస్ వెహికల్ అయినా ఇలా మండటాన్ని మనం గమనించవచ్చు. దీన్నే ప్లాస్మా షీత్ అంటారు. ఈ ప్లాస్మాకి రేడియో వేవ్స్ ను తనలోకి లాగేసుకునే గుణం ఉంటుంది. అందుకే ఆ స్పేస్ వెహికల్ తో భూమి మీద కమాండ్ సెంటర్ కి సంబంధాలు కొద్ది సమయం పాటు తెగిపోతాయి. 1957 లో స్పుత్నిక్ 2 భూమి మీదకు తిరిగివస్తున్నప్పుడు ఇలా ప్లాస్మా షీత్ కి స్పేస్ వెహికల్ లోనవుతుందని ఆ సమయంలో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని తొలిసారిగా ఖగోళ శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు.
మరి ఆ సమయంలో నాసా శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అనేది ఇక్కడ కీలకం. క్యాపూల్స్ భూమి మీదకు రీ ఎంట్రీ అయ్యే స్పీడ్ బట్టి అది దిగబోయే ట్రాజెక్టరీ ముందుగానే అంచనా వేస్తారు శాస్త్రవేత్తలు. దానికి అనుగుణంగా భూమి మీద ఉండే గ్రౌండ్ బేస్డ్ రాడార్స్, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్స్ ఆధారంగా ఆ క్యాప్సూల్ కిందకు దిగుతున్న తీరును గమనించవచ్చు. మొన్న సునీతా విలియమ్స్ వాళ్లు తిరిగొచ్చిన డ్రాగన్ క్యాప్సూల్ ను ఇలాగే ఇన్ ఫ్రారెడ్ సెన్సార్స్ తో గుర్తించారు. అందుకే ఈ కాసేపు ఇలా మనకు నల్లగా విజువల్స్ కనిపిస్తున్నాయి కదా ఇన్ ఫ్రారెడ్ తో చూస్తున్నారు కాబట్టే ఇలా కనిపించాయి ఆ విజువల్స్. ఒకసారి భూమి వాతావరణంలోకి క్యాప్సూల్ పూర్తిగా ప్రవేశించిన తర్వాత ప్లాస్మా చల్లారిపోతుంది. ఫలితంగా కమ్యూనికేషన్ మళ్లీ అందుతుంది.
మరి సిగ్నల్స్ లేనప్పుడు క్యాపూల్స్ లోపల సైంటిస్టులు ఏం చేస్తారు అంటే... తమ ముందున్న మానిటర్స్ మీద ఓ కన్నేసి ఉంచుతారు. కానీ వాళ్లు మ్యాన్యువల్ గా ఏమీ ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ కంప్యూటర్లన్నీ ప్రీ ప్రోగ్రామ్డ్ గైడెన్స్ సిస్టమ్స్ ద్వారా ఆటోమెటెడ్ సిస్టమ్స్ గా వ్యవహరిస్తాయి. ఒకవేళ సిగ్నల్ అందకపోయినా ఎలా దిగాలి ఎక్కడ దిగాలి అనే విషయాలన్నీ ప్రీ ప్లాన్డ్ ల్యాండింగ్ ప్రొసీజర్ రూపంలో ప్రోగామ్ చేస్తారు. ఒకవేళ మరీ ఏమన్నా ఎమర్జెన్సీ జరిగితే క్యాప్యూల్ లోపల ఉండే ఆస్ట్రోనాట్లు ప్రాణాలు దక్కించుకునేలా ఎమర్జెన్సీ మ్యాన్యువల్ ఓవర్ రైడ్ ఉంటుంది కానీ ఇప్పటివరకూ అలాంటి పరిస్థితులు ఎప్పుడూ కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్స్ లో ఎదురు కాలేదు. మొన్న సునీతా విలియమ్స్ వాళ్ల డ్రాగన్ క్యాప్య్సూల్ కూడా ఆరు నిమిషాల కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ తర్వాత చక్కగా సముద్రం మీద స్ల్పాష్ డౌన్ అయ్యింది.
చరిత్రలో కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ కారణంగా స్పేస్ వెహికల్స్ లో రీఎంట్రీలో ప్రమాదానికి గురైన సందర్భాలు అయితే నేరుగా లేవు. కానీ 1971 లో సోయుజ్ 11 వాహకనౌక శాల్యూట్ 1 స్పేస్ స్టేషన్ నుంచి అన్ డాక్ అయ్యింది. కానీ క్యాబిన్ ప్రెజర్ కారణంగా రీఎంట్రీ సరిగ్గా చేయలేకపోయింది. ఫలితంగా కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ ఏర్పడింది. క్యాప్యూల్ అయితే సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అయ్యింది కానీ అందులో ఉన్న ముగ్గురు ఆస్ట్రోనాట్లు దుర్మరణం పాలయ్యారు.
2003 లో జరిగిన కొలంబియా ప్రమాదం కూడా కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ గా చెప్పుకోవచ్చు కానీ దీనికి కారణం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వటం. ఫలితంగా ప్లాస్మా షీత్ టైమ్ లో కొలంబియా స్పేస్ వెహికల్ ఆ వేడికి తట్టుకోలేకపోయింది. విపరీతమైన ఉష్ణోగ్రతకు లోనైన కొలంబియా స్పేస్ షటిల్ భూమి మీదకు దిగుతుండగానే ముక్కలైపోయింది ఆ ఘోర ప్రమాదంలో మన భారతీయ మూలాలున్న ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా సహా ఏడుగురు ఆస్ట్రోనాట్స్ కన్నుమూశారు.
సో కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ అంత డేంజర్ అన్నమాట. అయితే ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది కాబట్టి ప్లాస్మా ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉండేలా స్పేస్ క్యాప్యూల్స్ ను తయారు చేస్తున్నారు. మొన్న సునీతా విలియమ్స్ వాళ్లు దిగిన డ్రాగన్ క్యాప్స్లూల్ ను ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేసింది. అందుకే అది చాలా తక్కువగా ప్లాస్మా షీత్ కు గురై భూవాతావరణంలో ప్రవేశించగానే చల్లబడిపోయింది. సముద్రంలో క్యాప్యూల్ దిగిన తర్వాత గమనిస్తే అవుటర్ సర్ ఫేస్ అంతా నల్లగా ఉంది గమనించారా దీనికి కారణమే ప్లాస్మా షీతే..ఇదే కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్ కు కూడా కారణం అయ్యి మనందరినీ ఆరు నిమిషాల పాటు టెన్షన్ పెట్టింది.