
Sunita Williams Coming back to Earth | Gravity లేకపోతే మన బతుకులు అథోగతేనా | ABP Desam
అంతరిక్షంలో గడిపితే మనుషులు హైట్ అవుతారా..?
భూమి మీద నా హైట్ 5 అడుగుల 7 అంగుళాలు..మరి స్పేస్ లోకి వెళ్లొస్తే ప్రభాస్ అంత హైట్ అవుతానా..?
క్యాన్సర్ పేషెంట్లను స్పేస్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తే త్వరగా క్యూర్ అయిపోతారా..?
210 రోజులుగా స్పేస్ లో ఉంటున్న సునీతా విలియమ్స్ భూమీ మీదకు వచ్చాక బరువులు ఎత్తలేక నరకం చూడాలా..?
ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈరోజు అంతరిక్షం కథలు ఎపిసోడ్ 1 లో డిస్కస్ చేద్దాం. వీడియో చివర వరకూ చూడండి. సబ్ స్క్రైబ్ చేసుకోని వాళ్లుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీ కోసం ఏబీపీ దేశాన్ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
8రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో పని చూసుకుని మళ్లీ తిరిగి భూమ్మీదకు వచ్చేయాలని అంతరిక్షంలోకి వెళ్లారు నాసా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్. అందరికీ తెలిసిన విషయమేగా సునీతా విలియమ్స్ కి భారతీయ మూలాలున్నాయి. సరే ఆ సంగతి పక్కనపెడితే 8 డేస్ లో వెనక్కు వీళ్లను తీసుకురావాల్సిన బోయింగ్ వాళ్ల క్రూ ఫ్లైట్ లో టెక్నిక్ ప్రాబ్లమ్స్ రావటంతో 210 రోజులుగా స్పేస్ లోనే సునీతా విలియమ్స్, విల్మోర్ ఉండిపోవాల్సి వచ్చింది.
మనం చాలా సార్లు విజువల్స్ లోచూశాం స్పేస్ లోకి వెళ్లాక సునీతా బాగా బక్క చిక్కిపోయారు. ముఖం మొత్తం పాలిపోయి..ఆమె రోజు రోజుకు ఓ ఎముకల గూడులా తయారవుతున్న విజువల్స్ ఫోటోలు అందరినీ భయపెట్టాయి. ఇప్పుడు కూడా సునీతా భూమి మీదకు తిరిగివచ్చాక ఆమె లిటరల్ గా నరకం చూడాలి. సరిగ్గా నడవలేరు. ఏ బరువులు ఎత్తలేరు. కనీసం నిలబడటం కూడా కొద్ది రోజుల పాటు కష్టమే. ఎందుకిలా అంటే ఆన్సర్ గ్రావిటీ.