Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP Desam

Continues below advertisement

   ఎన్నికల్లో ముఖచిత్రంలా నిలబడటం కాదు..ఎన్నికలను నడిపించగలిగే, నిలిచి గెలవగలిగే రాజకీయం కూడా తెలియాలి. లైక్ ఇండియాలో మోడీ పొలిటికల్ ఫేస్...కానీ అమిత్ షా రాజకీయ వ్యూహకర్త. ఇప్పుడు అమిత్ షా వ్యూహాలను ఓ బిజినెస్ మ్యాన్ ఫాలో అయితే అది కూడా అమెరికాలో. అచ్చం అలాంటి గేమ్ ప్లాన్సే వర్కవుట్ చేశాడు ఎలన్ మస్క్. వేల కోట్లకు అధిపతి అయిన ఎలన్ మస్క్ ట్రంప్ ను ప్రెసిడెంట్ చేయటానికి సింపుల్ గా తన ఆస్తిలో నుంచి వెయ్యి కోట్లు బయటకు తీసి అమెరికా పొలిటికల్ యాక్షన్ కమిటీ - సూపర్ ప్యాక్ అని ఓ సంస్థను ఎస్టాబ్లిష్ చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇది మన ప్రశాంత్ కిశోర్ పెట్టిన ఐప్యాక్ లాంటిది. ఈ సంస్థ ద్వారా జులై నుంచి పని చేస్తున్న మస్క్ మొత్తం ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ముందుండి నడిపించాడు. ట్రంప్ నడిపించిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA) మూమెంట్ కు సెకండ్ బిగ్గెస్ట్ ఫైనాన్స్ ఎలన్ మస్క్ సూపర్ ప్యాక్ నుంచే వచ్చిందని ఫోర్బ్స్ పత్రిక ప్రచురించింది. మిగిలిన బిలీయనర్లలా బ్యాక్ ఎండ్ సపోర్ట్ కాకుండా నేరుగా ట్రంప్ సభల్లోకి వచ్చి పాల్గొన్నాడు ఎలన్ మస్క్. వర్చువల్ టౌన్ హాల్స్ నిర్వహించటం ద్వారా రిపబ్లికన్ ఓట్స్ ఎక్కువ పోలయ్యేలా చేశాడు మస్క్. ఇవి కంటికి కనిపించేవే కంటికి కనిపించకుండా ట్రంప్ అనుకూల వాతావరణం క్రియేట్ చేసేందుకు తన కంపెనీ Xను పణంగా పెట్టేశాడు మస్క్.  కాన్ స్పిరిసీ థియరీలు, వోటింగ్ మిషన్స్ రిగ్గింగ్ జరిగాయంటూ, వలసవాదుల గురించి, ట్రాన్స్జెండర్ ఇష్యూస్ ఇలా ఒకటేంటి అనేకానేక మిస్ లీడింగ్ ఇన్ఫర్మేషన్ కు ఒకప్పటి ట్విట్టర్ ఇప్పుడు X ను వేదికగా చేసేశాడు మస్క్. అసలు ఆయన దాన్ని కొనుగోలు చేసిందే ట్రంప్ కోసం అంటారు ఎలన్ మస్క్. ఇదంతా చేస్తున్నందుకు ఎలన్ మస్క్ కి తను ఏం సాయం చేస్తానో కూడా ముందే చెప్పారు ట్రంప్. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ _ DOGE పేరుతో ఏర్పాటు చేయబోయే విభాగానికి ఎలన్ మస్క్ అధిపతిగా ఉంటారని ప్రకటించారు ట్రంప్. అలా సామ దాన బేధ దండోపాయాలు ఉపయోగించి ట్రంప్ ను ప్రెసిడెంట్ చేయటంలో సక్సెస్ అయ్యారు ఎలన్ మస్క్.  అందుకే ట్రంప్ కూడా విక్టరీ స్పీచ్ లో ఎలన్ మస్క్ ను అమెరికా రాజకీయాల్లో కొత్త స్టార్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram