Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
ఇండియన్ రూపీ ఆల్‌టైం లోయెస్ట్‌కి పడిపోయింది. బుధవారం రూపాయి విలువ ఒక అమెరికన్ డాలర్‌కు 90.19 రూపాయలకు పడిపోగా.. అది గురువారానికి మరింత దిగజారి 90.41 రూపాయలకు పడిపోయింది. రూపాయి విలువ ఇంతలా పడిపోవడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఇది మరింత దిగజారే పరిస్థితులున్నాయని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీనికి కారణం అమెరికాతో Trade dealపై స్పష్టత లేకపోవడమే కీ రీజన్ అని అంటున్నారు. అలాగే ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్‌తో కంపేర్ చేస్తే ఈ మధ్య కాలంలో ఇంపోర్ట్స్ భారీగా పెరగడం కూడా బలమైన కారణంగా కన్‌సిడర్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎక్కువ మొత్తంలో భారత్ నుంచి వెనక్కి తీసుకుంటుండటంతో పాటు భారతీయ రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్.. ఆర్‌బీఐ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోకపోవడం కూడా కారణాలుగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే, డాలర్ ఇండెక్స్ 100 కంటే తక్కువగా ఉంది కాబట్టి రూపాయి వాల్యూ స్టేబుల్‌గా కంటిన్యూ కావచ్చంటున్నారు. డాలర్ ఇండెక్స్ అనేది 1973లో 6 మేజర్ కరెన్సీలైన యూరో, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్, కెనడియన్ డాలర్, స్వీడిష్ క్రోనా, స్విస్ ఫ్రాంక్ కరెన్సీలతో కంపేర్ చేస్తూ 100 శాతంగా ఫిక్స్ చేశారు. ఇది 100 కంటే ఎక్కువగా ఉంటే డాలర్ బలపడినట్లు.. తక్కువగా క్షీణించినట్లు. ప్రస్తుతం ఇది దాదాపు 90.99 వరకు ఉంది. అందుకే రూపాయి స్థిరపడి.. రెండు మూడు రోజులుగా ఉన్న రూపాయి విలువ కొత్త బెంచ్‌మార్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహా అయితే 91 రూపాయల వరకు చేరొచ్చని అంచనా కడుతున్నప్పటికీ, ఈ వారంలో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల తర్వాత 88-89 రూపాయలకు తగ్గి అక్కడే స్థిరపడే ఛాన్స్ ఉందని అంచనా.