
PM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP Desam
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇప్పుడు ఓ వ్యాపారవేత్త మాత్రమే కాదు. ట్రంప్ క్యాబినెట్ లో ఆయనకు కీలక అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియన్స్ డోజ్ కి అధిపతిగా ఉన్న ఎలన్ మస్క్ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే మోదీతో మీటింగ్ కు మస్క్ తన భార్య షివోన్ జిలిస్, తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు. అమెరికాలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసేసిన దగ్గర్నుంచి అందరూ ఆఫీసులకు వచ్చే పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే మస్క్ కార్యాలయంలో తరుచగా ఆయన పిల్లలు, భార్య కూడా కనిపిస్తున్నారు. అలానే ఇవాళ మోదీతో మీటింగ్ కు కూడా భార్యాపిల్లలతో వచ్చారు మస్క్. మోదీ మస్క్ పిల్లల కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ది క్రిసెంట్ మూన్, విష్ణు శర్మ రాసిన పంచతంత్రం బొమ్మల కథలు, ఆర్ కే నారాయణ్ రాసిన చిన్న పిల్లల కథల పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. భారత్ లో ఏఐ, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మరోసారి ఎలన్ మస్క్ ను కోరారు ప్రధాని మోదీ.