Pakistan Behind Bangladesh Unrest | భారత్ దోస్తీని చెడగొట్టిన పాకిస్థాన్..! మోదీ ప్లాన్ ఏంటి..?

Pakistan Behind Bangladesh Unrest |బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల వల్ల ఇప్పటి వరకు 350 మందికిపైగా చనిపోయారు. రిజర్వేషన్లు తీసివేస్తామని షేక్ హాసినా సర్కార్ మాటిచ్చినప్పిటికీ.. యువత ఈ స్థాయిలో ఉద్యమం చేయడం వెనుక అంతర్జాతీయ పాలిటిక్స్ కూడా ఉన్నట్లు ప్రస్తుతం అనుమానాలు రేకేత్తుతున్నాయి. బంగ్లా అల్లర్ల వెనుక పాకిస్థాన్ ఉన్నట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. పాకిస్థాన్ లో యాక్టీవ్ గా ఉండే జమాత్ ఇ ఇస్లామి పార్టీకి చెందిన యూత్ వింగ్ బంగ్లాదేశ్ లోనూ ఉంది. ఆ యూత్ వింగ్ అనవరసంగా ఈ అల్లర్లు రేపుతోందని ఇటీవలే బంగ్లాదేశ్ సర్కార్ ఆ సంస్థను నిషేధించింది. ఐనప్పటికీ.. పాకిస్థాన్ లోని పార్టీలు, ఆర్మీ, ISI సపోర్ట్ ఆవింగ్ కు ఉండటంతో హింసాత్మక ఘటనలు ఇంకాస్త పెద్ద ఎత్తున చెలరేగాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.  దీని వల్ల పాకిస్థాన్ కు ఏం లాభం అంటే... పాకిస్థాన్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు షేక్ హాసినా తండ్రి ముజిబర్ రెహ్మాన్. సో.. ఆ పార్టీ ఇండియాకు సపోర్టివ్ గా ఉంటుంది. 2008 నుంచి షేక్ హాసినా ప్రధానిగా ఉండటంతో భారత్ తో సంబంధాలు మెరుగయ్యాయి. ఇది పాకిస్థాన్, చైనాకు మింగుడుపడటం లేదు.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola