Nepal Gen Z Protest Explained in Telugu | జెన్ Z కి కడుపు మండితే రివోల్ట్ ఈ రేంజ్ లో ఉంటుందా.? | ABP Desam
నేపాల్ అట్టుడికిపోతోంది. జెన్ జీ పేరుతో అక్కడ జరుగుతున్న ఉద్యమంతో లిటరల్ గా దేశం మొత్తం తగలబడిపోతోంది. సెప్టెంబర్ 8వ తారీఖున అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆ దేశ పార్లమెంటు భవనం..ప్రధాని ప్రైవేట్ నివాసం అన్నీ తగలబెట్టేశారు అక్కడి కుర్రోళ్లు. అసలు ఈ స్థాయిలో ఇంత ఉద్యమం రేగటానికి ప్రధాన కారణం సోషల్ మీడియా పై నేపాల్ ప్రభుత్వం విధించిన నిషేధం. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ సహా 26సోషల్ మీడియా యాప్ లపై నేపాల్ విధించిన నిషేధం ఇప్పుడు అక్కడ ప్రభుత్వాలే కుప్పకూలిపోయే పరిస్థితి తీసుకువచ్చింది.
సెప్టెంబర్ 8న జరిగిన హింసాత్మక ఘటనల్లో 19మంది యువకులు చనిపోయారు. 350మందికి పైగా కుర్రాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది పోలీసులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ ఈ ఆందోళనలు ఆగవని కుర్రకారు తేల్చిచెప్పేస్తుంటే నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలి దేశం రాజీనామా చేయక తప్పలేదు. అంతే కాదు ప్రాణాలు కాపాడుకోవటానికి దుబాయ్ పారిపోయే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియా బ్యాన్ పై అక్కడి ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే..దేశంలో మారిన నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సంస్థలను తమ నిబంధనలకు అంగీకరించాలని కోరామని వారం రోజుల గడువు ఇచ్చినా ఫలితం లేకపోవటం వాటిని నిషేధించామని నేపాల్ ప్రభుత్వం చెబుతోంది. కానీ సోషల్ మీడియా బ్యాన్ కి అసలు రీజన్..నేపాల్ లో యువతరమంతా భుజాలకెత్తుకుని మోస్తున్న Ban Nepo Kid, Ban Nepo Babies సోషల్ మీడియా ఉద్యమమని ఆందోళనకారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఖాట్మండూ పోస్ట్ లాంట్ నేపాలీ పత్రికలు కూడా చెబుతున్నాయి.
దేశంలో అవినీతి పేరుకుపోయిందని...2008 తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు తొలిసారి ఏర్పడి దేశం బాగుపడాలని ప్రజలంతా ఆకాక్షించినా అది జరగలేదని..పైగా దేశంలో నిరుద్యోగం, అవినీతి ఈ స్థాయి లో పెరిగిపోతుంటే దేశాధినేతలు, ప్రభుత్వాధినేతల పిల్లలంతా సోషల్ మీడియాలో తమ సెలబ్రెటీ లైఫ్ ను చూపిస్తూ పోష్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారని ఇది..జనరేషన్ జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య కాలంలో పుట్టిన పిల్లల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోందని అదే ఈ ఉద్యమంలా బయటకు వచ్చిందని అక్కడి మీడియా చెబుతోంది. 30ఏళ్ల లోపు ఉన్న యువతీ యువకులంతా కొన్నాళ్లుగా సోషల్ మీడియా వేదికగా నడుపుతున్న బ్యాన్ నెపో కిడ్స్ క్యాంపెయిన్ నచ్చకనే సోషల్ మీడియా యాప్స్ పై ప్రభుత్వం నిషేధం విధించిన దాంతో చిర్రెత్తుకొచ్చిన యువత రోడ్లపై కి వచ్చి ఇలా హింసకు దిగుతున్నారని నేపాలీ మీడియా రిపోర్ట్ చేస్తోంది. అయితే నేపాల్ ప్రభుత్వం మాత్రం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగం తో సోషల్ మీడియా సంస్థలు అంగీకారానికి రాకపోవటంతోనే బ్యాన్ విధించామని..ఇలా బయటకు వచ్చి యువత చేస్తున్న విధ్వంసం నేటి తరంపై సోషల్ మీడియా చూపిస్తున్న ప్రభావానికి సంకేతమని..సోషల్ మీడియా లేకపోవటంతో పిచ్చెక్కినట్లు ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారని ఇలాంటి పోకడలు ఏ దేశానికైనా ప్రమాదమేనని అక్కడి ప్రభుత్వం ఈ విషయాన్ని కవరప్ చేసే ప్రయత్నం చేసినా అది వర్కవుట్ అవ్వలేదు.