Khalistani Terrorists Firing Kapil Sharma Café | కెనడాలో కపిల్ శర్మ రెస్టారెంట్ పై ఉగ్రదాడి | ABP Desam

ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ప్రారంభించిన కెనడాలోని రెస్టారెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఉన్న ఈ కెఫే వద్దకు గుర్తుతెలియని దుండగులు కారులో వచ్చి కాల్పులు జరిపారు. ఈ దాడికి ఖలీస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) బాధ్యత వహించామని ప్రకటించింది. BKI‌కు చెందిన హర్జీత్ సింగ్ లద్దీ ఈ దాడికి నేరుగా సంబంధం ఉందని వెల్లడించుకున్నారు. హర్జీత్ సింగ్ ఇప్పటికే భారతదేశం జారీ చేసిన NIA మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నారు. కపిల్ శర్మ ఇటీవలే ఈ కఫేను ప్రారంభించగా ఈలోగా దుర్ఘటన జరిగింది. కాల్పుల ఘటనపై కెనడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ దాడిపై కపిల్ శర్మ ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. పంజాబ్ కు చెందిన కపిల్ శర్మ రెస్టారెంట్ పై దాడి జరపటం ద్వారా ఖలిస్థానీ ఉద్యమం ఉనికిని చాటాలని దుండగులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola