Israel vs Hamas Prisoners Released | బందీలను విడిచి పెడుతున్న హమాస్, ఇజ్రాయెల్ | ABP Desam
ఏడాదికిపైగా సాగిన హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిచింది. ఇరు వైపులా కాల్పుల విరమణకు ఒప్పందం కుదరటం ఇప్పుడు అక్కడ కాస్త శాంతి కనపడుతోంది. పైగా ఇరు వైపులా బందీలను విడుదల చేస్తున్న ఘటనలు మానవ సంబంధాల గొప్పతనాన్ని, భావోద్వేగాలను స్పష్టం చేస్తున్నాయి. తాజాగా హమాస్ నలుగురు ఇజ్రాయెలీ మహిళా బందీల్ని విడిచి పెట్టింది. వాళ్లు తమ కుటుంబసభ్యులు కలుసుకున్న ఆక్షణాన ఎంత ఆనందపడ్డారో చూడండి. ఇప్పటివరకూ యుద్ధం కారణంగా రెండు వైపులా కలిపి 47వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు కాల్పుల విరమణగా హమాస్ బందీలను విడిచిపెడుతుంటే...ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇప్పటి వరకూ 200 మంది బందీలను సురక్షితంగా పాలస్తీనాకు పంపించింది. ఇజ్రాయెల్ విడిచినపెట్టిన 200మందిలో 120 మంది ఏకంగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నారు. ఇరు వైపుల నుంచి బందీలు విడుదల అవుతుండటంతో వారి వారి కుటుంబాల్లో సంతోషం నిండిపోయింది. వీలైనంత త్వరగా బందీలను విడిచిపెట్టే ప్రక్రియ పూర్తైతే యుద్ధం కూడా త్వరగా ముగిసే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.