Hurricane Melissa batters Jamaica | జమైకాను నాశనం చేసిన మెలిసా హరికేన్ | ABP Desam
అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చిన ఒక తూఫాన్... జమైకా ను అతలాకుతలం చేస్తోంది. గంటకు 295 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆ తూఫాన్ పేరు మెలిసా. ఇది చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన తూఫాన్ గా రికార్డు సృష్టించింది. జమైకాలో తుపానులను నమోదు చేసే విధానం మొదలై 174 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఇంత తీవ్ర స్థాయిలో తుపాను నమోదు అవ్వడం ఇదే మొదటి సారి.
ఈ వీడియోలు ఏం ఉంది.. అంతా మామూలుగానే ఉంది కదా అని అనుకోకండి. కొన్ని ప్రాంతాల్లో కనీసం ఇలా ఫోటోలు వీడియోలు కూడా తీయలేని పరిస్థితులను ఎదుర్కొంటుంది జమైకా. సుమారుగా ఏడూ లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అంటే ఈ తూఫాన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చెట్లు విరుచుకుపడ్డాయి.. కొండ చరియలు విరిగి పడుతున్నాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయి.. దేశమంతటా అంధకారంలోకి వెళ్లిపోయింది.
మెలిసా తూఫాన్ ను కేటగిరీ 5 తుపానుగా ప్రకటించారు. మెలిసా తుపాను దెబ్బకు జమైకా చరిత్రలో ఎప్పడూ చూడని స్థాయిలో ఆస్తి నష్టాన్ని చూడబోతుందని ఆ దేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ప్రకటించారు. జమైకాను తాకిన మెలిసా తూఫాన్ కరీబియన్ కంట్రీ అయిన క్యూబా వైపు వెళ్తుంది.