Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
60ఏళ్లుగా మానవ చరిత్ర చూడని అతిపెద్ద అగ్నిప్రమాదం ఇది. 24గంటలుగా అక్కడి భారీ భవంతులు తగలబడుతూనే ఉన్నాయి. అత్యంత సాహసోపేతంగా ప్రాణాలకు తెగించిన పోరాడుతున్న ఫైర్ ఫైటర్లు...ఎంత శ్రమ పడుతున్నా ఆ మంటలు ఆరటం లేదు. ఇప్పటి వరకూ 55మంది ఈ ఘోర అగ్నిప్రమాదంలో సజీవదహనం అయ్యారు. ఇంకా 287మంది ఆచూకీనే తెలియటం లేదు. హాంకాంగ్ లో జరిగింది ఈ ఘోరం. హాంకాంగ్ లో తైపీలో ఉన్న ప్రఖ్యాత వాంగ్ ఫోక్ హైరెైజ్ అపార్ట్మెంట్స్ లో జరిగింది ఈ ఘటన. అక్కడ భవంతుల్లో అంటుకున్న చిన్న పాటి మంటలు పెద్దవై ఏడు భారీ భవంతుల సముదాయం మొత్తానికి అంటుకోవటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్న వారిలో ఎక్కువమంది పెద్ద వయస్సు వారు కావటంతో ఏం జరిగిందో లేదో తెలుసుకునే లోపే వాళ్లలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 55మంది చనిపోయినట్లు నిర్ధారించినా...24 గంటలుగా మండుతున్న మంటలు పూర్తిగా చల్లారి పొగ తగ్గితే తప్ప మొత్తం మృతుల సంఖ్య ఎంతో చెప్పలేమంటున్నారు అధికారులు. 287మంది ఆచూకీ దొరకపోవటంతో ఈ ప్రమాదం ఎంత మందిని బలితీసుకుందో ఊహిస్తేనే వణుకుపుడుతోంది. అపార్ట్మెంట్ గ్రిల్స్ కి వెదురు బొంగులతో చేసిన డెకరేషన్ కారణంగానే అత్యంత వేగంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ కన్స్ట్రక్షన్స్ కి కారణమైన నలుగురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇది నిజంగానే ప్రమాదమా లేదా ఏదైనా కుట్ర కోణం దీనివెనకు దాగి ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.