మా పాలనను గుర్తించకపోతే అంతర్జాతీయ సమస్యే! : తాలిబన్లు
Continues below advertisement
తమ పాలనను ప్రపంచదేశాలు గుర్తించాలని లేకపోతే ఇది అంతర్జాతీయ సమస్యకు దారితీస్తుందని తాలిబన్లు తెలిపారు. తమ పాలనను గుర్తించటం తమ హక్కు అని అన్నారు. అమెరికా, ఇతర దేశాలు తమను గుర్తించకపోతే, విదేశాల్లోని తమ ఆస్తులను ఫ్రీజ్ చేస్తే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. మహిళలు సహా అందరికీ సమాన హక్కులు ఉంటాయని తాలిబన్లు చెప్తున్నారు. కానీ అక్కడి పరిస్థితి వేరేలా ఉందని కొన్ని వీడియోలు చెబుతున్నాయి. కాబూల్ రోడ్ల మీదకు వచ్చిన కొంతమంది మహిళలు ప్రభుత్వం తమను అణిచివేస్తోందని ఆరోపించారు.
Continues below advertisement