Elon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP Desam

విశ్వాంతరాల అన్వేషణలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు బయటకొస్తూనే ఉంటాయి. ఈ మధ్య బయటకొచ్చిన ఓ సంగతి అంతరిక్ష అన్వేషకుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించింది. ఇంతకీ ఏంటా విషయం అంటే.. మార్స్ మీద చతురాస్రాకారంలో ఉన్న ఓ గుర్తును గుర్తించారు. దాదాపు 3 కిలోమీటర్ల వెడల్పు ఉన్న గుర్తును NASA కు చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ మార్స్ ఆర్బిటర్ (MOC) ఫోటోలు తీసింది. ఆ గుర్తును చూసినప్పటి నుంచి స్పేస్ అన్వేషకులు ( Space Enthusiasts) నుంచి సామాన్యుల వరకూ వారి వారి కోణంలో థియరీలు చెబుతున్నారు. అయితే స్పేస్ థియరీలపై, అంతరిక్ష కార్యక్రమాలపైనా విపరీతమైన ఆసక్తిని చూపించే గ్లోబల్ డ్రీమర్, Space CEO ఎలాన్ మస్క్- Elon Musk కూడా దీనిపై స్పందించాడు. ఆ గుర్తుల గుట్టేంటో బయట పెట్టాలంటున్నాడు. మస్క్ సంగతి తెలిసిందే కదా.. కేవలం తన ఆసక్తి మేరకే స్పేస్ ప్రోగ్రామ్స్‌లో వందల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన దీనిపై కన్నేశాడు అంటే దాని సంగతేంటో చూడాలి అనుకుంటున్నట్లు అర్థం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola