Eiffel Tower Demolition | ఈఫిల్ టవర్ కూల్చివేత | ABP Desam

Continues below advertisement

లవ్ సిటీగా పేరు పొందిన నగరం పారిస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లవర్స్ అంతా ఒక్కసారైనా చూడాలనుకునే ప్లేస్ పారిస్ నగరంలోని ఈఫిల్ టవర్. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమకు చిహ్నంగా ఈ టవర్ ను అందరు భావిస్తుంటారు. ఇప్పుడు ఈ ఈఫిల్ టవర్ కు సంబందించిన ఒక విషయం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే... ఈఫిల్ టవర్ కూల్చివేత. 2026లో ఫ్రెంచ్ ప్రభుత్వం ఈఫిల్ టవర్ ను కూల్చి వేస్తుందని గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ఇదే విషయాన్ని అందరు నమ్మడం మొదలు పెట్టారు. కానీ అది నిజామా అబ్బదమ్మా అని తెలుసుకోవడానికి మాత్రం ఎవరు ట్రై చెయ్యట్లేదు. అసలు నిజమెంటో ఇప్పుడు చూదాం. 

సోషల్ మీడియాలో వచ్చిన ఒక ఫేక్ న్యూస్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో హై లైట్ అయింది. ఈఫిల్ టవర్ 'లీజు' గడువు ముగిసింది, నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవుతుందని, నిర్మాణం బలహీనంగా మారిందని, అలాగే పర్యాటకులు చాలా వరకు తగ్గిపొయ్యారని అంటున్నారు. కాబట్టి ఈ టవర్ ను కూల్చేసి... దాని స్థానంలో "వాటర్ స్లయిడ్, కన్సర్ట్ హాల్ లేదా పారిస్ బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్" వంటి కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయొచ్చని న్యూస్ వచ్చింది. ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా 2026 లోనే ప్రారంభమవుతుందని కూడా అన్నారు. 

ఆలా ఆ పోస్ట్ మెల్లగా వైరల్ అవడం స్టార్ట్ అయింది. సర్రిగా అప్పుడే ఫ్రాన్స్‌లో ఖర్చుల తగ్గింపు, ధనవంతులపై పన్ను పెంపును డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేసారు. సో అక్టోబర్ 2, 2025 నుంచి ఈఫిల్ టవర్ ను  తాత్కాలికంగా మూసివేశారు. దాంతో ఈఫిల్ టవర్ ను నిజంగానే కూల్చేస్తారన్న వార్త ఇంకా వేగంగా వైరల్ అవటం మొదలు పెట్టింది. అయితే కూల్చడం గురించి ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. సో ఇది ఒక ఫేక్ న్యూస్. కానీ అందరు ఇదే నిజం అనుకోని నమ్మటం మొదలు పెట్టారు. 

నిజానికి 136 ఏళ్ల చరిత్ర ఉన్న ఈఫిల్ టవర్ ను ఎన్నో స్ట్రైక్ లు, 2015 పారిస్ దాడులు, కొవిడ్-19 .. లాంటి సమయాల్లో అనేకసార్లు తాత్కాలికంగా మూసివేశారు. ఈఫిల్ టవర్ ను కూల్చారని అక్కడున్న వారికీ తెలుసు. అందుకే వాళ్లు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ వేరే కంట్రీ వాళ్లు మాత్రం ఈ విషయంపై రియాక్ట్ అవుతూ... ఎన్నెన్నో కామెంట్స్ చేసారు. 

130  సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న పారిస్ ప్రపంచంలోనే 7 వింతలో ఒకటి. అలాంటి ఈఫిల్ టవర్ ను కూల్చేస్తారు అంటే ప్రజలు ఎలా నమ్మారో అర్థం కావట్లేదు. అందుకే ఎవరో చెప్పారని ఒక విషయాన్ని నమ్మే ముందు మనం రీ చెక్ చేసుకోవాలి. లేదంటే ఇలానే ప్రపంచమంతా ఒక అబ్బదాని నమ్మి మోసపోతుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola