Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP Desam

Continues below advertisement

 రెండు ఘటనలు అమెరికాను ఉలిక్కి పడేలా చేశాయి. మొదటిది లాస్ వేగాస్ లోని ట్రంప్ హోటల్ దగ్గర ఎలన్ మస్క్ కంపెనీకి చెందిన ప్రతిష్ఠాత్మక సైబర్ ట్రక్ కారు పేలిపోయింది. అందులో పెట్టిన బాంబులను ట్రంప్ హోటల్ ముందు ఉద్దేశపూర్వకంగా పేల్చినట్లు ఫెడరల్ ఇన్విస్టిగేషన్ బ్యూరో FBI అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. నిందితుడిగా భావిస్తున్న మాథ్యూ లివెల్స్ బెర్గగర్ ప్రస్తుతం యూఎస్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. మరోవైపు న్యూ ఆర్లీన్స్ లో ఓ మాజీ సైనికుడు అద్దె కారుతో బీభత్సం సృష్టించాడు. ఏకంగా 15మందిని తొక్కించి చంపేశాడు షంషుద్దీన్ జబ్బర్ అనే 42ఏళ్ల మాజీ సైనికుడు. ఇలా ఓ సైనికుడు, మాజీ సైనికుడు తమ కార్లతో అమెరికాలో సృష్టించిన విధ్వంసం తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. ఈ రెండు కార్లను టురో అనే యాప్ నుంచి అద్దెకు తీసుకున్నారని ఈ రెండు ఘటనలకు కచ్చితంగా సంబంధం ఉండి ఉంటుందని సైబర్ ట్రక్ కార్ల తయారీదారుడు, టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్  ట్వీట్ చేశారు. దేశం బయట నుంచి వస్తున్న అక్రమ వలసలు దేశానికి ముప్పు అని గతంలో తను చేసిన కామెంట్స్ ఇలాంటి ఘటనలు జరుగుతాయనే భయంతోనని అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. FBI మాత్రం ఈ రెండు ఘటనల మధ్య లింక్ కనిపెట్టేందుకు ఆధారాలు సేకరిస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram