Breaking News | Turkey Earthquake Updates: ఉదయాన్నే భారీ భూకంపం, 7.8 తీవ్రత

టర్కీలో ఇవాళ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. నుర్దాగి నగరానికి సుమారు 26 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటిదాకా 8 మంది మరణించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చంటున్నారు. ఈ భూకంపం కారణంగా కహ్రామన్ మారాస్ లో ని ఓ గ్యాస్ పైప్ లైన్ పేలిపోయినట్టు.... అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నట్టు స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola