Al Qaeda leader Zawahiri killed by U.S. forces | అల్ ఖైదా అధినేత అల్ జవహరీ హతం| ABP Desam
ABP Desam
Updated at:
02 Aug 2022 11:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅల్ ఖైదా అగ్ర నాయకుడు అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్ లో జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.
కాబుల్ లోని షేర్పూర్ ప్రాంతంలోని ఓ నివాసంపై వైమానిక దాడి జరిగినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్వీట్ చేశాడు. ఈ దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఖండించారు. ఈ ఘటనలో అల్ జవహరీ హతమైనప్పటికీ.. మరెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వివరించారు.