White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?

Continues below advertisement

 నాలుగు ఘటనలు...నాలుగు వేర్వేరు ప్రాంతాలు..జరిగనవన్నీ వేరేనే. కానీ కామన్ పాయింట్ ఒకటి ఉంది. అదే డాక్టర్స్. దేశంలో అలజడులు సృష్టించటానికి ప్రయత్నిస్తున్న ఉగ్రముఠాలు ఆపరేషన్ సిందూర్ తర్వాత వైట్ కాలర్ క్రైమ్ కి దిగుతున్నాయా. సొసైటీలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్నవారిపై ఉండే రెస్పెక్ట్ ను వాడుకుంటూ యావత్ భారతావనిని భయపెట్టాలని ప్లాన్ చేస్తున్నాయా..గడిచిన రెండు రోజులుగా జరిగిన ఈ నాలుగు ఘటనలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు పోలీసులను ఇదే ఆలోచనలో పడేస్తోంది. అసలేంటీ ఆ నాలుగు ఘటనలు...వైద్య వృత్తిని అడ్డం పెట్టుకుని ప్లాన్ చేస్తున్న నరమేధానికి ఇవన్నీ సంకేతాలా ఈ వీడియోలో చూద్దాం. 


Scene 1 – Faridabad, Haryana
  Date : November 10, 2025

ఫరీదాబాద్ లోని దాహూజ్ అండ్ ఫతేపూర్ టాగా ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు. దేశంలో అతిపెద్ద కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ లో ఒకటిగా భావిస్తున్న ఓ ఆపరేషన్ ను పోలీసులు సమర్థంగా నిర్వహించారు. జమ్ము కశ్మీర్ పోలీసులతో కలిసి ఫరీబాదాబ్ పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఇద్దరు డాక్టర్లు డా. ముజామిల్ షకీల్, డా. ఆదిల్ అహ్మద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు డాక్టర్లది జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ ప్రాంతం. వారి నుంచి 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఏకే 47 తరహా రైఫిల్స్, పిస్టర్స్, బాంబ్ టైమర్స్ ఇతర పేలుడు పదార్థాలను మారణాయుధాలును స్వాధీనపరుచుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ లో ఆదిల్ అహ్మద్ ను అరెస్ట్ చేయటంతో ఈ ఇద్దరు డాక్టర్ల ఉగ్రకుట్ర బయటపడింది. ఫలితంగా ఫరీదాబాద్ లీడ్ తెలిసింది.  భారీ మొత్తంలో పేలుడు పదార్థం స్వాధీనమైంది. 


Scene 2 – Lucknow, Uttar Pradesh
November 10, 2025

సీన్ జరిగింది లక్నోలో. డా. షహీన్ షాహిద్ పేరున్న ఓ లేడీ డాక్టర్ ను పోలీసులు లక్నోలో అరెస్ట్ చేశారు. ఆమెనుంచి ఏకే 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు కారులో చాలా క్యాట్రిడ్జ్ లు కూడా దొరికాయి. పోలీసులు చెప్పింది ఏంటంటే జమ్ము కశ్మీర్ నుంచి వచ్చి ఫరీదాబాద్ లో పేలుడు పదార్థాలతో దొరికిపోయిన ఇద్దరు డాక్టర్లకు ఈమెకు ఏదో లింక్ ఉంది అని. జమ్ము కశ్మీర్ డాక్టర్లను ఆపరేట్ చేస్తున్న సేమ్ నెట్ వర్కే ఈమెను కూడా ఆపరేట్ చేస్తోందని. కౌంటర్ టెర్రర్ ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. 

Scene 3 – Gujarat and Hyderabad
November 8, 2025

 గుజరాత్ కు  చెందిన ATS అధికారులకు ఉగ్ర కదలికలకు సంబంధించిన ఓ లీడ్ దొరికింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఇంకా మెహసానా ప్రాంతాలతో హైదరాబాద్ లో ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్ కు చెందిన డా. అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనే డాక్టర్ పెద్ద మొత్తంలో రైసిన్ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ డాక్టర్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని హైదరాబాద్ బేస్డ్ గా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏటీసీ సోదాల్లో విదేశీ తుపాకులు, రైసిన్ తయారీ కోసం పెద్ద మొత్తంలో సేకరించిన ఆముదాన్ని గుర్తించారు. ఈ రైసిన్ ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పదార్థాల్లో ఒకటి. క్షణాల్లో ప్రాణాలు తీయగలిగే శక్తి దీనికి ఉంది. ఆ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ను అరెస్ట్ చేసి గుజరాత్ కు తీసుకువెళ్లారు ATS అధికారులు.


Scene 4 – Car Blast in Delhi
November 10, 2025
   ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బ్లాస్ట్ అయ్యింది. చూస్తుండగానే 9 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ లో జరిగిన ఈ పేలుడులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎర్రకోట సమీపంలోని ఓ మసీదు ప్రాంగణంలో పేలుడుకు గురైన కారు 3 గంటలు పాటు పార్క్ చేసి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 6.20 వరకూ కారును పార్కింగ్ లోనే ఉంచి ఆ తర్వాత బయటకు తీసుకు వస్తున్న వ్యక్తి విజువల్స్ ను సీసీటీవీ ఫుటేజెస్ లో పోలీసులు గుర్తించారు. కారు నడపుతున్న వ్యక్తిని డా.మహ్మద్ ఉమర్ గా అని తేల్చారు. పేలుడు జరిగిన ప్రాంతంలో అమ్మోనియం నైట్రేట్ ట్రేసెస్ ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. డిటోనేటర్లు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే ఇది ఆత్మాహుతి దాడిలా జరిగిందా...ఫరీదాబాద్ లో పట్టుబడిన డాక్టర్ల గురించి వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఎర్రకోట్ల దగ్గర బ్లాస్ట్ కు ప్లాన్ చేశారా...ఏదైనా ఉగ్ర సంస్థ మొత్తం డాక్టర్లతో ఈ ఆపరేటింగ్ నెట్ వర్క్ ను మెయింటైన్ చేస్తోందా..నిజమైతే వాళ్ల ప్లాన్ ఏంటీ..ఢిల్లీ బ్లాస్ట్ కోసమే ఇదంతా చేశారా లేదా మరేదైనా పెద్ద ప్లాన్ లో ఉన్నారా..దీనంతటి కోసం పవిత్రమైన వైద్యవృత్తిని ఎంచుకుని...ప్రాణాలు పోసే వైద్యులతోనే ప్రాణాలు తీయించే ప్లాన్ చేస్తున్నారా...సంచలన విషయాలు మరికొద్ది రోజుల్లోనే నిగ్గు తేలనున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola