Parliament: అనుచిత ప్రవర్తన కింద పన్నెండుమంది ఎంపీలపై క్రమశిక్షణాచర్యలు
Continues below advertisement
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే పలువురు విపక్ష ఎంపీలకు రాజ్యసభలో గట్టి షాక్ తగిలింది. గత వర్షాకాల సమావేశాల్లో సభలో అనుచితంగా, హింసాత్మక ధోరణితో ప్రవర్తించిన పలువురు ఎంపీలపై రాజ్యసభ క్రమశిక్షణా చర్యల కింద వేటు వేసింది. ఈ మేరకు కాంగ్రెస్ సహా పలు పార్టీలకు చెందిన 12మంది ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన సభ్యులు ఆరుగురు ఉండగా.. శివసేన, తృణమూల్ కాంగ్రెస్ నుంచి చెరో ఇద్దరు, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
Continues below advertisement