Vishnuvardhan Reddy : వివాదాస్పద నిర్ణయాలవల్లే ఏపీ ప్రజలు అట్టడుగుకి వెళ్లిపోతున్నారు
ఏపి ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలవల్ల పేద ప్రజలు అట్టడుగుకు వెళ్లిపోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుడు ఇసుక, స్టీల్, సిమెంట్ కొనే పరిస్థితుల్లో లేరని... సినిమా టికెట్ల కంటే ముందు సీఎం జగన్... కనీస నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేలా దృష్టి సారించాలని కోరారు. బుధవారం వీఐపీ విరామ సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని... అందుకే ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ, జనసేన పొత్తుతో అధికారంలోకి వస్తేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది విష్ణువర్ధన్ అన్నారు.