మూల పాడు సచివాలయానికి తాళాలు వేసిన యజమాని.
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులో సచివాలయానికి యజమాని తాళాలు వేశారు. 6నెలలుగా అద్దె చెల్లించక పోవడంతో తాళాలు వేయాల్సి వచ్చిందని ఇంటి యజమాని అంటున్నారు.అధికారులు,ప్రజా ప్రతినిధుల కు ఎన్ని సార్లు మోర పెట్టుకున్నా ఫలితం లేదని ఆయన అంటున్నారు.దీని పై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్దానికులు కోరుతున్నారు.