Vande Metro Roll out Started | వందే మెట్రో ట్రయల్‌కు గ్రీన్ సిగ్నల్ | ABP Desam

Continues below advertisement

భారతదేశంలో మొట్టమొదటి వందే మెట్రో రైలు ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో దీనికి సంబంధించిన రోల్ అవుట్‌ను ప్రారంభించారు. దీని బేసిక్ యూనిట్‌ను కపుర్తలా లో ఉన్న రైల్ కోచ్ ఫ్యాక్టరీలో రూపొందించారు. ఈ ట్రైన్‌లో ఉన్న ఫీచర్లన్నీ వందే భారత్ ట్రైన్ తరహాలోనే ఉన్నాయి. అసలు ఈ వందే మెట్రో అంటే ఏంటి? వందే భారత్‌కు, వందే మెట్రోకు తేడా ఏంటి? వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లకు షార్ట్ డిస్టెన్స్ వేరియంట్లే ఈ వందే భారత్ మెట్రో అని చెప్పవచ్చు. 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాల మధ్య వేగంగా ప్రయాణం చేసేందుకు ఈ వందే భారత్ మెట్రో ఉపయోగపడనుంది. 124 నగరాలను ఈ వందే మెట్రో నెట్‌వర్క్ కవర్ చేయనుంది. ఢిల్లీ టు రెవారీ, ఆగ్రా టు మధుర, లక్నో టు కాన్పూర్, భువనేశ్వర్ టు బాల్సోర్, తిరుపతి టు చెన్నై... ఇలా పలు రకాల రూట్లలో ఈ వందే మెట్రో రైళ్లు నడవనున్నాయి. తక్కువ ధరలో వేగవంతమైన ప్రయాణాన్ని అందించడమే వందే మెట్రో లక్ష్యం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram