Vanama Raghava: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో నాకెలాంటి సంబంధం లేదు...!

Continues below advertisement

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ, అతని కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో తనకెలాంటి ప్రమేయం లేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన వనమా రాఘవ...రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు ఆర్థిక పరిస్థితులే కారణమన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ కుటుంబానికి వారసుడిగా తన తల్లిని సరిగ్గా చూసుకోవాలని రామకృష్ణకు సూచించానన్న రాఘవ అదెలా తప్పవుతుందని ప్రశ్నించారు. రాజకీయంగా తన ఎదుగుదలను అడ్డుకునేందుకే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి తన తప్పు ఉందని తేలితే శిక్ష అనుభవించటానికి సిద్ధమని రాఘవ ప్రకటించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram