UTF Decision On PRC: పీఆర్సీ పై కలిసి వచ్చే సంఘాలతో ఆందోళనకు సిద్ధమవుతున్న యూటీఎఫ్
విజయవాడలో యూటీఎఫ్ కార్యాలయంలో పీఆర్సీ పై సమావేశం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై యూనియన్ నేతలు సమీక్షించి విశ్లేషణ చేశారు.అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన ఫిట్ మెంట్ ఉద్యోగులందరికి తీవ్ర నష్టంగా పరిగణిస్తుందని అన్నారు,.సీపీఎస్ అంశాన్ని వాయిదా వేయటం సరైంది కాదని అన్నారు.కాంట్రాక్ట్,అవుట్ సోర్సింగ్ ,ఉద్యోగుల వేతనాల పై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వం అనుసరిస్తున్న విదానం చూస్తే,రాబోయే రోజుల్లో పీఆర్సీ ఉండదనే సంకేతం వెలువతుందని అన్నారు.ఉద్యోగులకు ప్రత్యక్షంగా జీతాలు తగ్గకుండా డీఎలను విడుదల చేయటం మోసపూరిత చర్యగా అభివర్ణించారు.పదవీ విరమణ వయస్సును 62ఎళ్ళకు పెంచటం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందన్నారు.దీని వలన 2ఎళ్ళ వరకు పదోన్నతులు,నియామకాలు ఉండబోవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.పీఆర్సీ పై కలసి వచ్చే సంఘాలతో దశల వారీ ఆందోళనకు సన్నద్ధం అవుతున్నట్లు వెల్లడించారు.