గూగుల్ క్రోం అప్ డేట్ చేసుకుని సైబర్ నేరగాళ్ల దాడి నుంచి తప్పించుకోండి
కంప్యూటర్ లేదా గూగుల్ క్రోంను ఎప్పిటికప్పుడు అప్ డేట్ చేసుకోండి... లేకపోతే భయంకరమైన మాలిషియస్ వైరస్ ద్వారా సైబర్ నేరగాళ్లు దాడి చేసే అవకాశముందని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన టీమ్ కీలక హెచ్చరిక జారీ చేసింది. 97.0.4692.71 కంటే పాత వెర్షన్ వాడుతున్న వారి డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ మేరకు యూజర్లు అందరూ వీలైనంత త్వరగా క్రోంను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు.